Chandigarh: చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావడంపై దేశంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. చండీగఢ్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సరళీకృతం చేయడాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
READ ALSO: Rajamouli : రాజమౌళి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే
ఈ ప్రతిపాదన చండీగఢ్ ప్రస్తుత పరిపాలనా వ్యవస్థను మార్చదని అలాగే పంజాబ్, హర్యానాలతో చండీగఢ్‌కు ఉన్న సాంప్రదాయ సంబంధాలను ప్రభావితం చేయదని హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అందరితో సంప్రదించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కూడా ఈ ప్రకటనలో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది. చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని చూడటాన్ని పంజాబ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
READ ALSO: PM Modi – Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..
The proposal only to simplify the Central Government’s law-making process for the Union Territory of Chandigarh is still under consideration with the Central Government. No final decision has been taken on this proposal. The proposal in no way seeks to alter Chandigarh’s…
— PIB – Ministry of Home Affairs (@PIBHomeAffairs) November 23, 2025