Central Railway Recruitment 2024: 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది.. సెంట్రల్ రైల్వే జోన్ యొక్క రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు దాని ముంబై క్లస్టర్, భుసావల్ క్లస్టర్, పూణె, నాగ్‌పూర్, షోలాపూర్ క్లస్టర్‌లలో అవసరమైన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను తాజాగా ప్రకటించింది.. ఎస్‌ఎస్‌ఎల్‌సీతో పాటు వివిధ ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.. 10వ తరగతి అర్హతతో మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్ లో ఆగస్టు 15వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.. 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు గడువు ఇచ్చింది.. అయితే, 10వ తరగతిలో 50 శాతం మార్కులతో పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను (ఐటీఐ అప్రెంటిస్) కూడా సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది రైల్వేశాఖ..
రైల్వే క్లస్టర్ వైజ్ అప్రెంటీస్ ఖాళీల వివరాలు:
ముంబై క్లస్టర్ – 1594
భుసావల్ క్లస్టర్ – 418
పూణె క్లస్టర్ – 192
నాగ్‌పూర్ క్లస్టర్ – 144
షోలాపూర్ క్లస్టర్ – 76
ఇక, సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు వయస్సు అర్హత విషయానికి వస్తే.. దరఖాస్తు చేయడానికి కనీసం 15 సంవత్సరాల వయస్సు ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు మించకూడదు. తరగతుల వారీగా వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ 16-07-2024 ప్రారంభం కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు 15-08-2024 సాయంత్రం 05 గంటల వరకు అవకాశం ఉంటుంది..
రైల్వే అప్రెంటిస్ పోస్టుల ఎంపిక విధానం
SSLC పరీక్షలో 50 శాతం మార్కులు మరియు ITI ట్రేడ్‌లలో పొందిన 50 శాతం మార్కులను జోడించి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారిని పోస్టులో కేటాయిస్తారు. అప్రెంటీస్ చట్టం ప్రకారం వారికి నెలవారీ స్టైఫండ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
* సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వెబ్‌పేజీని (https://rrccr.com/tradeapp/login.) సందర్శించండి.
* ఓపెన్ వెబ్ పేజీలో ‘రిజిస్టర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి’పై క్లిక్ చేయండి.
* మరొక వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.. వ్యక్తిగత వివరాలను నమోదు చేసి నమోదు చేసుకోవాలి..
* రిజిస్ట్రేషన్ ID మరియు పాస్‌వర్డ్‌ను రూపొందించిన తర్వాత మళ్లీ లాగిన్ చేయాలి.
* అభ్యర్థించిన సమాచారాన్ని అందించడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
* దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు..
* నెలవారీ స్టైపెండ్ : రూ.7000 – 10000 గా ఉంటుంది..