Ap Taxes Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా…ఆరేళ్ళలో ఏపీకి 1 లక్షా 88 వేల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎస్టీతో సహా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద గత 6 సంవత్సరాల్లో (2017 నుంచి 2023 మార్చి 10 వరకు) 1,88,053.83 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వాటా కింద విడుదల చేస్తున్న పన్నుల ఆదాయం గత 5 ఏళ్ళుగా తగ్గుతూ వస్తోందా? అంటూ రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు.
కేంద్ర వసూలు చేసిన పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2017-18లో 29,001.25 కోట్లు, 2018-19లో 32,787.03 కోట్లు, 2019-20లో 28,242.39 కోట్లు, 2020-21లో 24,460.59 కోట్లు, 2021-22 లో 35,385.83 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి 38,176.74 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలోని 29 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల వాటా కింద గడిచిన ఆరేళ్ళలో 45,11,442.86 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 2017-18లో 6,73,005.29 కోట్లు, 2018-19లో 7,61,454.15 కోట్లు, 2019-20లో 6,50,677.05 కోట్లు, 2020-21లో 5,94,996.76 కోట్లు, 2021-22 లో 8,82,903.79 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి 9,48,405.82 కోట్లు ఆయా రాష్ట్రాల వాటా కింద విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Read Also:Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం పన్నుల ద్వారా వసూలు చేసిన నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా కింద నెలవారీ ప్రాతిపదికన పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నికర ఆదాయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 279 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా నిర్ధారించి, ధృవీకరిస్తారని కూడా మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
Read Also: Kim Jong Un: కిమ్ చేష్టలు.. బుల్లెట్లు మిస్సైనందుకు ఏకంగా నగరం మొత్తం లాక్‌డౌన్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!