Yoga Break: సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇకపై ‘యోగా బ్రేక్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ఇక నుంచి యోగా బ్రేక్ తీసుకోవాలని మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, కార్యాలయాల్లోని తమ కుర్చీల్లో కూర్చొని యోగా చేయొచ్చని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో భోజన విరామం, టీ, టిఫిన్ కోసం బ్రేక్‌లు ఉండేవి.. కానీ.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ను కూడా తీసుకురావటంతో ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా బ్రేక్ ను తప్పకుండా వాడుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ జీవోను జారీ చేసింది.
Also Read : Amit Sha Tour: నేడే హైదరాబాద్ కు అమిత్ షా.. దర్శక ధీరుడు రాజమౌళితో భేటీ..!
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
పని చేసే ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించుకుని పునరుత్తేజం పొందేందుకు వీలుగా ఆఫీసు సమయంలో కుర్చీలోనే యోగా చేయాలని పేర్కొనింది. నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం.. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులు పడుతుంటారు. వీటి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు ఆఫీసుల్లోని కుర్చీలో యోగా చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించారు.
Also Read : Wednesday Stotra: ఈ స్తోత్రాలు వింటే ఆర్థిక ఇబ్బందులు, శారీరక, మానసికలు దూరమవుతాయి
అయితే, కుర్చీల్లో కూర్చొని ఎలాంటి ఆసనాలు వేయాలనే అనుమానం కొందరు ఉద్యోగులకు రావొచ్చు.. అలాంటి వారికోసం, కార్యాలయాల్లో ఎలాంటి ఆసనాలు వేసేందుకు వీలుందో తెలిపే యూట్యూబ్ వీడియోల లింక్‌లను మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది శిక్షణ , వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన యూట్యూబ్ లింక్ లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విదివిధానాలు ఉంటాయని తెలిపింది. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు సూచించింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. అన్ని ప్రభుత్వ శాఖలు వై-బ్రేక్ గురించి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?