Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచింది. కొత్త డీఏ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.