E vehicle policy: ఈ-వాహనాల విధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ-వాహనాల విధానానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్‌ను ఈ-వాహనాల తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రం కూడా ప్రోత్సాహకాలు అందజేయనుంది. తక్కువ కస్టమ్స్ డ్యూటీకి పరిమిత సంఖ్యలో కార్ల దిగుమతికి అనుమతి ఇవ్వనుంది.
EVల తయారీకి ప్రధాన కేంద్రంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ-వాహన విధానాన్ని ఆమోదించింది.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పవర్‌హౌస్‌గా భారతదేశ స్థానాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈవీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం.. స్వదేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో EVలు తయారు చేసేందుకు పూనుకుంది.
వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్ అనుకూలమైనదిగా కేంద్రం తెలిపింది. అలాగే దేశంలోని ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని ఆ శాఖ పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ప్రాముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకోసమే ఈవీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈవీల తయారీకి భారత్ గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని కేంద్రం పేర్కొంది. భారత్‌లోకి ప్రవేశించేందుకు అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమం అయినట్లే.
కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు దేశంలో పెట్టుబడిగా పెడితే.. పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేకిన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. భారతదేశంలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలను ప్రోత్సహించేందుకు కనిష్ట ధర, బీమా మరియు సరుకు రవాణా, వాహనాలపై 15 శాతమే కస్టమ్స్ సుంకం విధించనుంది. ఇక పెట్టుబడి పెట్టే కంపెనీలు తక్కువ కస్టమ్స్ డ్యూటీ రేటుతో EVల పరిమిత దిగుమతులకు అనుమతించనుంది.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!