Minimum Wages: కార్మికులకు కనీస వేతనాలను పెంచిన కేంద్ర ప్రభుత్వం..
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు.
- కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది.
- సంవత్సరానికి రెండుసార్లు 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minimum Wages: వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)ని సవరించడం ద్వారా ఈ పెంపు జరిగింది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త వేతన విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.783, సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.868, స్కిల్డ్ వర్కర్లకు రూ.954, హై స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.1035 లభిస్తాయి. నైపుణ్యం, నివసించే ప్రాంతం ఆధారంగా కొత్త వేతనాన్ని నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిర్మాణం, లోడింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్, ఇంటి పని, మైనింగ్, వ్యవసాయంతో సహా వివిధ అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. VDA సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్ 1 – అక్టోబరు 1) 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా సవరించబడుతుంది.
iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
కొత్త సవరణ ప్రకారం, జోన్ “A”లో నిర్మాణ, శుభ్రత వంటి రంగాలలో నైపుణ్యం లేని కార్మికులు ఇప్పుడు రోజుకు రూ.783 సంపాదిస్తారు, ఇది నెలకు రూ.20,358 అవుతుంది. సెమీ స్కిల్డ్ వర్కర్లు ఇప్పుడు రోజుకు రూ.868 కాగా., నెలకు రూ.22,568 పొందుతారు. అయితే నైపుణ్యం కలిగిన, క్లరికల్ కార్మికులు రోజుకు రూ.954 కాగా నెలకు రూ. 24,804 పొందుతారు. అధిక నైపుణ్యం కలిగిన కార్మికులు, వార్డు సిబ్బంది, సాయుధ గార్డులు రోజుకు రూ.1,035 సంపాదిస్తారు. మొత్తంగా నెలకు రూ.26,910 పొందుతారు.
Riya Barde Arrest : మహారాష్ట్రలో బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా అరెస్టు.. కారణం ఇదే
ఈ సవరణ ఏప్రిల్‌లో మునుపటి అప్‌డేట్ తర్వాత 2024కి రెండవ వేతన సవరణను సూచిస్తుంది. పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచికలో హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రభుత్వం ఏప్రిల్, అక్టోబర్ లలో ద్వైవార్షిక VDAని సవరిస్తుంది. వివిధ రంగాలు, కేటగిరీలు, స్థానాల కోసం నవీకరించబడిన పే రేట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) clc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!