NTV Telugu Site icon

TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ

Tirumala

Tirumala

TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. పురాతన కట్టడాలు కావడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆర్కియాలజీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు నెలల క్రితం కట్టడాల పరిశీలన జరిపి తగిన సూచనలు చెయ్యాలని ఆర్కియాలజీ అధికారులను టీటీడీ కోరింది.

Read Also: Ambati Rayudu: అందుకే వైసీపీని వీడుతున్నా.. అంబటి రాయుడు ట్వీట్

మూడు నెలలుగా ఆర్కియాలజీ శాఖ అధికారులు స్పందించలేదు. కట్టడాలు కూలీపోయ్యే ప్రమాదం వుండడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ అడిషనల్ సెక్రటరి రంజన్ చోప్రా దృష్టికి ఈవో ధర్మారెడ్డి తీసుకువెళ్లారు. కట్టడాల పున:నిర్మాణంపై నిబంధనల మేరకు సూచనలు చేయాలని ఈవో ధర్మారెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కట్టడాలను టీటీడీ పున:నిర్మించేందుకు సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది ఆర్కియాలజీ శాఖ. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సర్కిల్స్‌కి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 17, 18వ తేదీలలో పరిశీలన జరిపి కమిటీ టీటీడీకి సూచనలు చేయనుంది.