ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో విశ్వాసంతో శివుడికి అభిషేకం చేసే పాలలో ఓ వ్యక్తి ఉమ్మేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాలు కొనుగోలు చేసే లవ్ శుక్లా అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. వాస్తవానికి.. లవ్ శుక్లా బంకే బిహారీ, కన్వర్ యాత్రల సమయంలో శంకర్జీ(శివుడు)కి అభిషేకం చేయడానికి ఈ పాలను ఉపయోగించేవాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా…