సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి CBSE పరీక్షలో ఉత్తీర్ణులై 11, 12 తరగతుల్లో తదుపరి విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన ఒంటరి బాలికలకు మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. 10వ తరగతి CBSE పరీక్షల్లో 70% లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన.. 11, 12వ తరగతుల్లో చదువు కొనసాగించే వారికి అందిస్తారు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 23, 2025.
Also Read:Vijayawada: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. వీఐపీ దర్శనాలపై ఆలయ ఈవో అసహనం
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025:.. 2025లో 10వ తరగతి ఉత్తీర్ణులై ఇప్పుడు CBSE అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతిలో చేరిన విద్యార్థుల కోసం. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ పునరుద్ధరణ 2024.. గత సంవత్సరం స్కాలర్‌షిప్ పొంది కొనసాగింపు కోరుకునే విద్యార్థుల కోసం అందుబాటులో ఉంది. రెండేళ్ల వరకు నెలకు రూ.1,000 చొప్పున అందిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అర్హత
వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం అయి ఉండాలి.
CBSE 10వ తరగతి పరీక్షలో కనీసం 70% మార్కులు సాధించాలి.
11 లేదా 12వ తరగతిలో CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతున్నారు.
ట్యూషన్ ఫీజు 10వ తరగతిలో నెలకు రూ.2,500, 11, 12 తరగతులలో నెలకు రూ.3,000 (ఎన్ఆర్ఐ విద్యార్థులకు రూ.6,000) మించకూడదు.
కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలకు మించకూడదు.
మంచి ప్రవర్తన మరియు క్రమం తప్పకుండా హాజరు తప్పనిసరి.
11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
Also Read:Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించి, విద్యార్థి ప్రస్తుతం చేరిన పాఠశాల ద్వారా ధృవీకరించాలి. అసంపూర్ణమైన దరఖాస్తులు పరిగణించబడవు. తల్లిదండ్రులు ధృవీకరించబడిన ఫీజు స్లిప్‌తో పాటు నోటరీ చేయబడిన స్టాంప్ పేపర్‌పై ఆదాయానికి సంబంధించిన స్వీయ ప్రకటనను కూడా అప్‌లోడ్ చేయాలి. ఒకసారి రద్దు చేసిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరించలేమని CBSE స్పష్టం చేసింది.