NTV Telugu Site icon

Drugs Case: 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో వీడిన సందిగ్ధత

Drugs Case

Drugs Case

Vizag Port Drugs Case: వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్ షిప్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో నిర్ధారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని నిర్ధారణ అయింది.కోర్టుకు ఇదే సమాచారాన్ని సీబీఐ ఇచ్చింది. కంటైనర్ షిప్‌ను కూడా ఇటీవల విడిచిపెట్టామని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ వెల్లడించారు.

Read Also: Ambati Rambabu: ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తారు?.. సెటైర్లు వేసిన అంబటి రాంబాబు

ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్, జర్మనీ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్ షిప్ చేరుకుందని తెలిపారు. గతంలో విశాఖ పోర్టుకు 25 వేల టన్నుల డ్రగ్స్‌ వచ్చి చేరాయనే సమాచారం నేపథ్యంతో రాజకీయ ఆరోపణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కావడంతో కంటైనర్ లో వచ్చినవి డ్రగ్స్ అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు విచారణ చేశారు. చివరకు ఆ కంటైనర్‌ను వినియోగించుకోవచ్చని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడంతో విశాఖల డ్రగ్స్ కేసులో చిక్కుముడి వీడింది.