వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్ షిప్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో నిర్ధారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని నిర్ధారణ అయింది.కోర్టుకు ఇదే సమాచారాన్ని సీబీఐ ఇచ్చింది.
UGC- NET2024: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పత్రాన్ని ఆదివారం నాడే లీక్ చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి.