రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన “మూటలో మహిళా శవం” హత్య కేసు వివరాలను షాద్ నగర్ ఏసీపీ ఎన్.సిహెచ్ రంగస్వామి మీడియాకు వెల్లడించారు. గత నెల 27వ తేదీ రాత్రి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ కన్నా భాగ్యలక్ష్మి అలియాస్ లక్ష్మి (40) హత్యకు గురైంది. ఆమె శవాన్ని ఓ బ్లాంకెట్ లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో ఓ డ్రైనేజ్ పక్కన మూటగట్టి పడేశారు. దీంతో అదే కాలానికి చెందిన స్థానికుడు మహమ్మద్ సాదిక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సెప్టెంబర్ 28వ తేదీన స్థానిక ఏసిపి ఎన్. సీహెచ్ రంగస్వామి, పట్టణ సీఐ విజయ్ కుమార్ తదితర పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు.
Nadendla Manohar: రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే నిత్యవసర సరకులు
చెడు వ్యసనాలకు అలవాటు పడి దురాశతో కన్నా భాగ్యలక్ష్మిని గద్వాల జిల్లా చాగాపురం గ్రామానికి చెందిన వడ్డే పరమేష్ (43) ఆమెతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత అరతులం బంగారం కోసం ఆశపడి ఆమెను గొంతు పిసికి హత్య చేశాడని ఏ ఏసీపీ తెలిపారు. కన్నా భాగ్యలక్ష్మి 27వ తేదీ రాత్రి 10 గంటలకు వడ్డే పరమేష్ తో కలిసి ఇంటికి చేరుకుంది. అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ భాగ్యలక్ష్మి రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసిన అనంతరం 11 గంటల సమయంలో నిందితుడు వడ్డే పరమేష్ భాగ్యలక్ష్మి గొంతు పిసికి అరవకుండా ఆమె నోరు మూసి హత్య చేశాడని ఎసిపి రంగస్వామి తెలిపారు.
MLC Botsa Satyanarayana: అందుకే ఏపీలో లులు మాల్ వద్దన్నాం..
అనంతరం ఆమె చెవి కమ్మలు, పూస్తే, 5000 రూపాయల నగదు దోచుకుని ఫ్యాషన్ బైక్ పై వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. భాగ్యలక్ష్మి మొబైల్ ను డ్రైనేజీలో వేసి పరమేష్ వెళ్ళిపోయాడు అని పోలీసులు తెలిపారు. ఆమె శవాన్ని ఒక రగ్గులో చుట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని డ్రైనేజీ పక్కన పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. 15 రోజుల క్రితం పరిచయమైన వడ్డే పరమేష్ గద్వాల నుండి ఇక్కడికి కూలీ పనులు చేసుకోవడానికి వచ్చాడు. అతనికి తెలిసిన వ్యక్తి హనుమంతు పరిచయంతో షాద్ నగర్లొ కూలి నాలీ చేసుకుంటున్నాడని వివరించారు. నిందితుడి కోసం అనేక సీసీ కెమెరాలు పరీక్షించి ఆ తర్వాత కొన్ని ఆధారాలతో నిందితుడు అద్దెకు ఉంటున్న యాదవ కాలనీలో ఓ ఇంట్లో వడ్డే పరమేష్ ను గుర్తించినట్టు తెలిపారు. సాంకేతిక ఆధారాలు ఇతర ఆధారాలతో వడ్డే పరమేష్ ను అదుపులోకి తీసుకొని ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు.