Here IS Health Banefits of Carrot Juice: మనం నిత్యం తీసుకునే ‘క్యారెట్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 8 మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌ను చాలా రకాలుగా తీసుకుంటారు. కొందరు కర్రీ వండుకుంటే.. మరికొందరు జ్యూస్ చేసుకుని తాగేస్తారు. చాలా మంది మాత్రం పచ్చివి తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పచ్చివి తినే కంటే జ్యూస్ చేసుకుని తాగటం మంచిది. ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
బరువు తగ్గడం:
క్యారెట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. దీని ద్వారా ఆకలిని చాలా కాలం పాటు నియంత్రించవచ్చు. అతిగా తినడం మానేస్తారు. బెల్లీ ఫ్యాట్ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
చర్మానికి ప్రయోజనకరం:
క్యారెట్ మన చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందింస్థాయి. రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బ్లడ్ షుగర్ నుంచి రక్షణ:
బ్లడ్ షుగర్‌తో బాధపడేవారు తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం వలన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగిన మోతాదులో ఉంటాయి. క్యారెట్‌లో ఉండే క్యాలరీలు, విటమిన్లు, మినరల్స్ మధుమేహాన్ని నిరోధించడానికి పోరాడతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
శీతాకాలం వచ్చిన వెంటనే ఇన్ఫెక్షన్ ప్రమాదం చాలా పెరుగుతుంది. దీని కారణంగా మీరు జలుబు, దగ్గు లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కోసం మీరు మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అటువంటి పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి క్యారెట్ జ్యూస్‌ని త్రాగాలి.
గుండె జబ్బులు దూరం:
క్యారెట్ జ్యూస్‌లో ఉండే బీటా కోరెటిన్ గుండె జబ్బులకు దారితీసే ప్రీ రాడికల్స్ పోరాడానికి చాలా అవసరం. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలెట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దాంతో చెడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ జరగకుండా తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు.
Also Read: Best Recharge Plan 2023: బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 84 రోజుల పాటు 2 GB డేటా, అపరిమిత కాలింగ్!