Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో కారు దగ్ధం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

Tirumala

Tirumala

Tirumala: తిరుమలలోని జీఎన్సీ టోల్ గెట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘట్ రోడ్డులో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. భక్తులు కారు ఆపి భయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

READ MORE: Census: ఏప్రిల్1, 2026 నుంచి ప్రారంభం కానున్న జనాభా గణన.. ముందుగా ఇళ్ల లెక్కింపుతో షురూ..

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో కూడా తిరుమలలో షార్ట్‌సర్క్యూట్‌తో ఓ కారు దగ్ధమైంది. అగ్నిమాపకశాఖ అధికారుల వివరాల మేరకు.. ఒంగోలుకు చెందిన సి.నరేంద్ర ఐదుగురు కుటుంబసభ్యులతో కలిసి ఒంగోలు నుంచి తన కారులో తిరుమలకు బయలుదేరారు. తిరుమలకు చేరుకుని స్థానిక సీఆర్వో కార్‌ పార్కింగ్‌ వద్ద కారు పార్క్‌ చేశాడు. అకస్మాత్తుగా కారు ఇంజన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని వారు బయటకు దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

READ MORE: Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు.. పూర్ణచంద్ర నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు

Exit mobile version