Tirumala: తిరుమలలోని జీఎన్సీ టోల్ గెట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘట్ రోడ్డులో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. భక్తులు కారు ఆపి భయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్‌లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.