Site icon NTV Telugu

P20 Summit: జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్‌కు హాజరుకానున్న కెనడా.. ఈ దేశాలు పాల్గొనవు!

P20 Summit

P20 Summit

P20 Summit: అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్‌- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల కెనడా చాలా మంది దౌత్యవేత్తలను భారతదేశం నుంచి బహిష్కరించింది. కెనడా దౌత్యవేత్తలను అనేక ఇతర దేశాలకు వారిని తరలించింది.

రెండు రోజుల జీ-20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం తెలిపారు. ఈ సదస్సులో 26 మంది అధ్యక్షులు, 10 మంది ఉపాధ్యక్షులు, 50 మంది ఎంపీలు, 14 మంది ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ అధ్యక్షుడు తొలిసారిగా భారతదేశంలో జరిగే పీ-20 ఈవెంట్‌కు హాజరవుతారు.భారత్‌లో జరగనున్న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో జర్మనీ, అర్జెంటీనా పాల్గొనవు. దీని వెనుక ఈ దేశాలు తమ అంతర్గత కారణాలను ప్రస్తావించి, కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశాయి.

Also Read: CEC: 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం

మరోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన తర్వాత భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాస్తవానికి నిజ్జర్ హత్య వెనుక బహుశా భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే, కెనడా ప్రధాని ఆరోపణలను అసంబద్ధం, రాజకీయ ప్రేరేపితమని భారత్ తోసిపుచ్చింది. విలేకరుల సమావేశంలో లోక్‌సభ స్పీకర్ మాట్లాడుతూ.. రెండు రోజుల కార్యక్రమంలో పీ-20 శిఖరాగ్ర సమావేశంతో సహా నాలుగు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయని చెప్పారు. భారతదేశ పురాతన, భాగస్వామ్య ప్రజాస్వామ్య సంప్రదాయాలను హైలైట్ చేయడానికి ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ ప్రదర్శన కూడా నిర్వహించబడుతుంది. 9వ పీ-20 సమ్మిట్‌ను భారత పార్లమెంటు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి.

Exit mobile version