Site icon NTV Telugu

Justin Trudeau: కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!

Canada Prime Minister Justin Trudeau

Canada Prime Minister Justin Trudeau

Canada Prime Minister Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి విచ్చేసిన జస్టిన్‌ ట్రూడో తిరిగి కెనడాకు బయల్దేరుతుండగా.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. విమానంలో సమస్య తలెత్తడంతో ఆయన తిరిగి ఢిల్లీలోనే ఉన్నారు.

Also Read: African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..

జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ రాజధానికి వచ్చిన కెనడా ప్రతినిధి బృందం, గ్రౌండ్‌లోని ఇంజనీరింగ్ బృందం సమస్యను సరిదిద్దే వరకు భారతదేశంలోనే ఉంటుందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. జస్టిన్ ట్రూడో తన కుమారుడు జేవియర్‌తో కలిసి సెప్టెంబర్ 8న జీ20 సమ్మిట్ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

Exit mobile version