NTV Telugu Site icon

India-Canada Row: లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు.. కెనడా తీవ్ర ఆరోపణలు

Canada

Canada

India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. ప్రో ఖలీస్థానీలను టార్గెట్ గా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

Read Also: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?

ఇక, హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో విచారణ పురోగతి వివరాలను రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు సోమవారం రాత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్‌ బ్రిగిట్టె గౌవిన్‌ మాట్లాడుతూ.. కెనడాలోని ప్రో- ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వీరు కొన్ని గ్రూప్‌ల సహాయంతో మా భూభాగంపై నేరాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. లారెన్స్ బిష్ణోయ్‌ గ్రూప్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో రహస్య సంబంధాలు ఉన్నాయని మేం నమ్ముతున్నాం అని గౌవిన్‌ వెల్లడించారు. ఈ ఆరోపణలకు కూడా ఒట్టావా ఎలాంటి ఆధారాలను చూపించలేదు.

Read Also: Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఫ్లైఓవర్ పై వాహనాల పార్కింగ్

అయితే, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో ఇటీవల లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఈ పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ జైలులో ఉన్నారు. అతడి సోదరుడు, ఇతర అనుచరులు కెనడా కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.