Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్ గ్రీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cameron Green Suffers From Kidney Disease: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి అరుదైన కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నానని, అది పూర్తిగా నయం కాని వ్యాధి అని తెలిపాడు. తన మూత్ర పిండాలు మిగతా వారిలా రక్తాన్ని శుద్ధి చేయవని, అవి ప్రస్తుతం 60 శాతమే పనిచేస్తున్నాయని గ్రీన్ చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కాని గ్రీన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
తాజాగా కామెరూన్ గ్రీన్ ‘ఛానెల్ 7’తో మాట్లాడుతూ… ‘నాకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉంది. ఈ విషయాన్ని నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులకు వైద్యులు చెప్పారు. ఈ వ్యాధికి ఎటువంటి లక్షణాలు ఉండవు. కేవలం అల్ట్రాసౌండ్‌ల ద్వారానే గుర్తించాలి. మిగతా వారిలా నా కిడ్నీలు పనిచేయలేవు. ప్రస్తుతం 60 శాతం పని చేస్తున్నాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఇతర వ్యక్తుల వలె నేను శారీరకంగా ప్రభావితం కాలేదు. ఈ వ్యాధిలో ఐదు దశలు ఉన్నాయి. మొదటి దశ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఐదవ దశలో కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ చేయాలి. ఇప్పుడు నేను స్టేజ్-2లో ఉన్నాను. వాటిని బాగా చూసుకోకపోతే పాడయ్యే ప్రమాదముంది’ అని తెలిపాడు.
Also Read
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
Also Read: IND vs SA: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం! సిరీస్ సమం
తాను 12 ఏళ్లకు మించి బతకలేనని మా తల్లిదండ్రులకు వైద్యులు చెప్పారని, ఇన్ని ఏళ్లు బాగా ఉన్నందుకు సంతోషంగా ఉందని కామెరూన్ గ్రీన్ తెలిపాడు. గ్రీన్ తల్లి టార్సీ 19 వారాల గర్భంతో ఉండగా.. స్కానింగ్‌లో ఈ విషయం బయటపడింది. గ్రీన్ 12 ఏళ్ల కంటే ఎక్కువ బతకడని ఆ సమయంలో వైద్యులు చెప్పినట్లు తండ్రి గ్యారీ చెప్పాడు. గ్రీన్ పుట్టిన తర్వాత ఇంక్యుబేటర్ లో ఉంచారని తెలిపాడు. ఇక 24 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. ఇటీవల ఆర్‌సీబీ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ కోసం ఆర్‌సీబీ రూ. 17.5 కోట్లు వెచ్చించింది.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!