Ujjwala Scheme: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన మోడీ సర్కార్.. మరోసారి ఉచితంగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjwala Scheme: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. మరో దఫా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగే ఈకోర్ట్ మిషన్ మోడ్ ఫేజ్ త్రీకి ఓకే చెప్పింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. G20 సమావేశాలు విజయవంతంగా జరగడంతో ప్రధాని మోడీని, దేశ ప్రజలను కేంద్ర కేబినెట్ అభినందించింది. మొత్తంగా ఉజ్వల పథకం విస్తరిస్తోంది కేంద్రం.. ఎన్నికల సంవత్సరంలో 75 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.. ఉచిత LPG గ్యాస్ కనెక్షన్ పొందుతారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ – ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు 9.60 కోట్ల LPG సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి.. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని.. మరో 75 లక్ష ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను విస్తరించింది. ఈ పథకం కింద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. మూడేళ్లలో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని, ఇందుకు మొత్తం రూ.1,650 కోట్లు ఖర్చు అవుతుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉండనున్నారు. గత నెలలో ప్రభుత్వం 75 లక్షల కొత్త కనెక్షన్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నిధికి ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలకు విడుదల చేస్తారు. ఉజ్వల పథకాన్ని 2016 మేలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. మరోవైపు.. గత నెలలో ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఈ కోత తర్వాత, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్లను రూ.903కి విక్రయిస్తున్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు కూడా దాని ప్రయోజనాలను పొందుతున్నారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?