Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Two-Wheeler Sales: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ ఏడాది, అంటే 2026 మొదటి 9 నెలల గణాంకాలను పరిశీలిస్తే ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు విపరీతంగా దూసుకెళ్లాయి. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. జనవరి 2026 నుంచి సెప్టెంబర్ 2026 మధ్య మనదేశంలో ఏకంగా 15.61 లక్షల ఎలక్ట్రిక్ రెండు చక్రాల వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ రికార్డు స్థాయి సేల్స్‌లో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ కంపెనీలదే హవా. మొత్తం అమ్ముడైన వాహనాల్లో ఏకంగా 76 శాతం వాటా ఈ నాలుగు దిగ్గజ కంపెనీలదే కావడం విశేషం. మార్కెట్ మొత్తాన్ని ఈ టాప్-4 బ్రాండ్లే శాసిస్తున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈసారి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. 2025 మొదటి 9 నెలల్లో కేవలం 9.61 లక్షల ఈవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఏకంగా 6 లక్షల వాహనాలు అదనంగా అమ్ముడై, సంవత్సరానికి 62 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. అంతెందుకు, 2025 మొత్తం సంవత్సరానికి కలిపి కంపెనీలు 13.42 లక్షల ఈవీలను విక్రయిస్తే, ఆ రికార్డును ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే దాటేయడం గమనార్హం. ఇక ఈ ఏడాది మొదటి 9 నెలల్లోనే గత ఏడాది పూర్తి సంవత్సరం కంటే 2.19 లక్షల యూనిట్లు ఎక్కువ అమ్ముడయ్యాయి. గత నెల ఒకదానిలోనే ఏకంగా 1.97 లక్షల ఈవీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి, ఇది ఆగస్టు నెలతో పోలిస్తే 7.7 శాతం ఎక్కువ. మిగిలిన ఈ మూడు నెలల్లో జరిగే ప్రతీ సేల్ ఈ సెగ్మెంట్ సాధించే తిరుగులేని గ్రోత్‌కే తోడవుతుంది.
Also Read
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ఈ ఊపులో టీవీఎస్, బజాజ్ కంపెనీలదే ప్రధాన పాత్ర అని చెప్పాలి. కస్టమర్ల ఆదరణ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ (iQube) జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. మరోవైపు బజాజ్ చేతక్ (Chetak) పోయిన నెల అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. వీటితో పాటు ఏథర్ ఎనర్జీకి చెందిన రిజ్టా (Rizta), హీరో మోటోకార్ప్ విడా (Vida) కూడా టాప్ సెల్లింగ్ స్కూటర్ల లిస్టులో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికైతే వీటి సెప్టెంబర్ నెలాఖరు సేల్స్ అధికారికంగా బయటకు రానప్పటికీ, ట్రెండ్ మాత్రం అదిరిపోయింది. ఈ సేల్స్ సునామీతో మార్కెట్ షేర్ పరంగా పెద్ద కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరినప్పటికీ, చిన్న కంపెనీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రివర్ మొబిలిటీ (River Mobility) ని ఉదాహరణగా తీసుకుంటే, 2025లో కేవలం 1.27 శాతంగా ఉన్న దీని మార్కెట్ వాటా, 2026కి వచ్చేసరికి ఏకంగా 2.46 శాతానికి పెరిగి రెట్టింపు కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!