Obesity : మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా ఊబకాయం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది దీనితో బాధపడుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతేడాది మార్చి 4ని ప్రపంచ స్థూలకాయ దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచంలో పెరుగుతున్న ఊబకాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ఈ ఏడాది కొత్త నివేదికను ప్రకటించింది. దీని ప్రకారం 2035 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది స్థూలకాయంతో బాధపడతారని వెల్లడించింది.
Read Also: Illicit Relationship: నచ్చజెప్పాడు.. వినలేదు.. తుపాకీతో కాల్చి చంపాడు
నివేదిక ప్రకారం, 2025 నాటికే జనాభాలో ఎక్కువ భాగం మంది స్థూలకాయంతో ఉంటారని పేర్కొంది. అయితే 2035 నాటికి, ప్రపంచ జనాభాలో 51 శాతం మంది వారి వయస్సుకు అనుగుణంగా అధిక బరువు కలిగి ఉంటారని తెలిపింది. ఈ నివేదికలో పిల్లలు, యువకులు కూడా ఈ వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. అందువల్ల, ఈ వ్యక్తులు గుండె జబ్బులు, మధుమేహంతో కూడా బాధపడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Read Also:Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?
స్థూలకాయం 2025 నాటికి యువ తరంపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక చెబుతోంది. వ్యాయామం లేకపోవడం, ఆహారంలో మార్పు, మొత్తంగా మారిన జీవనశైలి కారణంగా ఈ సమస్య చాలా తీవ్రమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, వారి ప్రభుత్వ సంస్థలు యువత భవిష్యత్తు కోసం కొత్త విధానాలను నిర్ణయించాలి. యువ తరాన్ని స్థూలకాయానికి దూరంగా ఉంచేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊబకాయం అనేది శరీరంలో అనేక వ్యాధులకు కారణమయ్యే వ్యాధి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అది కొవ్వుగా మారుతుంది. శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఎస్)ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.