Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black Grapes: మనం ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్షపండ్లు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష దాదాపు అన్ని కాలాల్లో మనకు విరివిరిగా లభ్యమవుతూ ఉంటాయి. ద్రాక్ష పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ద్రాక్షను తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాల ద్రాక్ష రకాలు ఉన్నాయి.. ఒకటి ఆకుపచ్చ ద్రాక్ష పండ్లు, రెండు నల్ల ద్రాక్ష పండ్లు. అయితే ఇందులో ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల కంటే నల్ల ద్రాక్ష పండ్లు మన శరీరానికి మరింత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇక శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో ద్రాక్ష పండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. నల్ల ద్రాక్షను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.
ఖాళీ కడుపున తీసుకుంటే..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
నల్ల ద్రాక్షను తినడం వల్ల మేలు కలిగినప్పటికి వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా వీటిని ఖాళీ కడుపున అస్సలు తీసుకోకూడదట. నల్ల ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనకు తెలియకుండానే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటాం. ద్రాక్ష ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. ద్రాక్షను మితిమీరి తింటే.. మనం బరువు పెరిగే అవకాశం ఉందని, అలాగే ఇవి శరీరంపై, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదండోయ్ ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు కలిగే అవకాశం ఉంది.
Read also :Extramarital Affair: భర్త బయటికెళ్లగానే.. భాయ్ ప్రెండ్‌కు ఫోన్.. సీన్ కట్ చేస్తే
ద్రాక్ష తీసుకోవడం వలన జీర్ణక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉందని, కడుపు నొప్పి తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని.. వీటిలో సహజ సిద్ద చక్కెరలు ఉండటం వలన ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. కావున ద్రాక్షను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.. వీటిలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ అలర్జీలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నల్లద్రాక్షను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ద్రాక్ష పండ్లను ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం అంతే సంగతులు.. ఇది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని ఖాళీ కడుపున తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడంతో పాటు కడుపులో నొప్పి, కడుపులో చికాకు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున ద్రాక్ష పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందాలంటే వీటిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Pakistan: హోలీ జరుపుకున్నందుకు హిందూ విద్యార్థులను చితకబాదిన తోటి విద్యార్థులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!