NTV Telugu Site icon

By-Elections: జులై 10న ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

Elections

Elections

లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.

READ MORE: Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!

రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి.. బీహార్‌- 1, పశ్చిమ బెంగాల్‌- 4, తమిళనాడు- 1, మధ్యప్రదేశ్‌- 1, ఉత్తరాఖండ్‌- 2, పంజాబ్‌- 1, హిమాచల్‌- 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న విడుదలైంది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగిసింది. జూన్ 24న పరిశీలన కూడా జరిగింది. జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. వాటి ఫలితాలు ఈనెల13న వెల్లడిస్తారు.

READ MORE:Ambani Sangeet Party: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ లో బాలివుడ్ తారల హంగామా..

పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలైన మానిక్తలా, రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్ మరియు బాగ్దాలో ఉపఎన్నికల జరగనుంది. రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్ మరియు బాఘ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి చేరి.. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. ఎన్నికలలో ఓడిపోయారు. మానిక్తలా టీఎంసీ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. రాయ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి కృష్ణ కళ్యాణి, బీజేపీ అభ్యర్థి మానస్ కుమార్ ఘోష్ పోటీ చేస్తున్నారు. కాగా, వామపక్ష కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా సీపీఎం సీనియర్ నేత మోహిత్ సేన్ గుప్తా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బాగ్దా అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ నుంచి మధుపర్ణ, బీజేపీ నుంచి బినయ్ కుమార్ విశ్వాస్ బరిలో నిలిచారు. రణఘాట్ సౌత్ నుంచి ముకుత్ మణి అధికారిని టీఎంసీ రంగంలోకి దించింది. ఆయన బీజేపీ అభ్యర్థి మనోజ్‌కుమార్ విశ్వాస్‌తో తలపడనున్నారు.