By-Elections: జులై 10న ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
- జులై 10న పోలింగ్
- ఈ నెల 13న ఫలితాలు వెల్లడించనున్న ఎన్నికల సంఘం
- ఇప్పటికే పూర్తయిన ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.
READ MORE: Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!
Also Read
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి.. బీహార్- 1, పశ్చిమ బెంగాల్- 4, తమిళనాడు- 1, మధ్యప్రదేశ్- 1, ఉత్తరాఖండ్- 2, పంజాబ్- 1, హిమాచల్- 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న విడుదలైంది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగిసింది. జూన్ 24న పరిశీలన కూడా జరిగింది. జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. వాటి ఫలితాలు ఈనెల13న వెల్లడిస్తారు.
READ MORE:Ambani Sangeet Party: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ లో బాలివుడ్ తారల హంగామా..
పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలైన మానిక్తలా, రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్ మరియు బాగ్దాలో ఉపఎన్నికల జరగనుంది. రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్ మరియు బాఘ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి చేరి.. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. ఎన్నికలలో ఓడిపోయారు. మానిక్తలా టీఎంసీ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. రాయ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి కృష్ణ కళ్యాణి, బీజేపీ అభ్యర్థి మానస్ కుమార్ ఘోష్ పోటీ చేస్తున్నారు. కాగా, వామపక్ష కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా సీపీఎం సీనియర్ నేత మోహిత్ సేన్ గుప్తా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బాగ్దా అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ నుంచి మధుపర్ణ, బీజేపీ నుంచి బినయ్ కుమార్ విశ్వాస్ బరిలో నిలిచారు. రణఘాట్ సౌత్ నుంచి ముకుత్ మణి అధికారిని టీఎంసీ రంగంలోకి దించింది. ఆయన బీజేపీ అభ్యర్థి మనోజ్‌కుమార్ విశ్వాస్‌తో తలపడనున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!