Jammu Kashmir : 200 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డుపై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. భలేసా నుంచి థాత్రికి ఓ ప్రైవేట్ మినీ బస్సు వెళ్తుండగా భాటియాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికక్కడే ఒక మహిళ చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని వారు చెప్పారు. వీరిలో మరో మహిళ, బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.
Read Also:Telangana: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు..
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఎనిమిది మంది పరిస్థితి విషమం
మృతులను బషీరా బేగం (50), సలీమా బేగం (55), బస్సు డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్ (25)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న దోడా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్, ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Read Also:IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్
రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి
నెల రోజుల క్రితం జమ్మూలోని అఖ్నూర్‌లో యాత్రికులతో వెళ్తున్న బస్సు 150 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. జమ్మూ-పూంచ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌తో పాటు రాజస్థాన్‌కు చెందిన 90 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ వ్యక్తులు హత్రాస్ నుండి శివ్ ఖోడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!