Sourav Ganguli: టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదని స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమైన తర్వాత బుమ్రా వెన్నునొప్పి కోసం స్కానింగ్ చేయించుకోవడానికి బుధవారం తిరువనంతపురం నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడని వార్తలు రాగా.. వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉన్నందున టోర్నీలో బుమ్రా ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని గంగూలీ అన్నారు. బుమ్రా అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు.
Hyderabad Traffic Rules : సిగ్నల్ దాటితే ఇక అంతే.. రూల్స్ మారాయ్..!
అయితే బుమ్రాకు 6 నెలల విశ్రాంతి అవసరమంటూ వార్తలు వచ్చాయి. బుమ్రా వంటి సిసలైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం టీ20 వరల్డ్ కప్ కీలక టోర్నీలో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సౌరవ్ గంగూలీ తాజా వ్యాఖ్యలతో బుమ్రా టోర్నీకి అందుబాటులో ఉండొచ్చన్న ఆశలు కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16నే ప్రారంభం కానున్నా.. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 23న పాకిస్థాన్‌తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి భారత్ చాలా ప్రయత్నాలు చేసింది. ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌లతో పాటు గత మూడు నెలల కాలంలో వారు ఐర్లాండ్, ఇంగ్లాండ్, కరేబియన్, యూఏఈలలో
టీ20లు ఆడారు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా*, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
రిజర్వ్ ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.
