Delhi : ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) శనివారం ఛతర్‌పూర్‌లోని దివంగత వ్యాపారవేత్త పాంటీ చద్దా ఫామ్‌హౌస్‌లో బుల్‌డోజర్‌ను నడిపింది. దాదాపు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో ఎక్కువ భాగం ప్రభుత్వ భూమిలో నిర్మించారు. దీని ధర దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని సమాచారం. ఆపరేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలంలో మోహరించారు. ఈ ఫామ్‌హౌస్ కూల్చివేత పనులు ఆదివారం కూడా కొనసాగుతాయి. దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో దాదాపు 10 ఎకరాల్లో మాజీ మద్యం వ్యాపారి పాంటీ చద్దా అలియాస్ గుర్దీప్ సింగ్ ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి. ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారు.
Read Also:High Temperature: రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
దీంతో ఆక్రమణలు తొలగించాలని డీడీఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీడీఏ శుక్రవారం నుండే ఈ ఫామ్‌హౌస్ కూల్చివేత పనిని ప్రారంభించింది. అది శనివారం కూడా కొనసాగింది. ఇప్పటి వరకు ఈ ఫామ్‌హౌస్‌లో ఐదు ఎకరాల్లోని ఆక్రమణను తొలగించినట్లు రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. డిడిఎ ప్రకారం, శనివారం చీకటి పడిన తరువాత ఈ చర్యను నిలిపివేసారు. కాని ఆదివారం ప్రభుత్వ భూమి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ఆక్రమణల నుండి విముక్తి పొందుతుంది. 2012 నవంబర్‌లో ఇదే ఫామ్‌హౌస్‌లో జరిగిన కాల్పుల్లో పాంటీ చద్దా.. అతని సోదరుడు హర్‌దీప్ మరణించారని వర్గాలు తెలిపాయి. ఆస్తి తగాదాల కారణంగానే అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నట్లు తేలింది.
Read Also:AP High Court: హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి.. ఏపీ హైకోర్టులో పిల్!