జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!

Bsnl

Bsnl

BSNL Rs 225 Prepaid Plan Launched: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.225తో లభించే ఈ సరికొత్త ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ డేటా, ఉచిత SMSలతో పాటు 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కావాలనుకొనే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు బిఎస్ఎన్ఎల్ “సిల్వర్ జూబ్లీ” గా నామకరణం చేశారు.

ఈ రూ.225 రీచార్జ్ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేషనల్ రోమింగ్ కూడా పూర్తిగా ఉచితం. డేటా విషయానికి వస్తే.. రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో 30 రోజుల కాలంలో మొత్తం 75GB డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా వినియోగించుకోవచ్చు. ఎక్కువగా కాల్స్, మెసేజ్‌లు ఉపయోగించే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఎంపిక.

×
×
Ad

కొత్త వినియోగదారులకు రూ.51 స్పెషల్ ప్లాన్:

ఇక కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రత్యేకంగా రూ.51 రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్తగా BSNL సిమ్ తీసుకునే వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రూ.51 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్, రోజుకు 2GB డేటా, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. అంతేకాకుండా కొత్త కస్టమర్లకు ఉచిత సిమ్ కార్డు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీని తట్టుకునేందుకు BSNL దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తోంది. ఒకవైపు తక్కువ ధరల్లో మంచి ప్లాన్‌లు అందిస్తూనే.. మరోవైపు నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.