NTV Telugu Site icon

Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Murder

Murder

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్‌ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్‌ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం సిద్ధం చేశారు.

Also Read: Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు

మృతునికి భార్య సిరిన్‌, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దారుణ హత్య నేపథ్యంలో కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రషీద్‌ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరగా గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య వేములవాడ పట్టణంలో తీవ్ర కలకలాన్ని రేపింది. దారుణ హత్యతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: Chalo Raj Bhavan: టీపీసీసీ ఆధ్వర్యంలో “చలో రాజ్‌భవన్‌”.. నిరసనల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం

Show comments