నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్‌లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీలో పాల్గొన్న మిగతా స్నేహితులు వినయకుమార్ తలపై బండ రాయితో కొట్టి హత్య చేశారు. ప్రస్తుతం నిందితుు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృదేహాన్ని పోర్టు మర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం సృష్టించింది.
READ MORE: Stipend: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన స్టైపెండ్
