నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్‌లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.