Rajamandri: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుక్కంపేట డి బ్లాక్‌లో ఘోర హత్యాచారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి తల్లిని, ఆమె కూతురిని దారుణంగా హత్య చేశాడు వ్యక్తి. మృతులను ఎండి సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండి సానియా (16)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరపగా నేపథ్యంలో హంతకుడిని హైదరాబాద్‌కు చెందిన పల్లి శివకుమార్ గా గుర్తించారు. శివకుమార్ గతంలో మృతురాలు సల్మాన్‌తో ఈవెంట్ కార్యక్రమాల్లో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారి మధ్య స్నేహం క్రమంగా నడుస్తుండగా ఈ హత్యకు దారి తీసింది.
Read Also: Minister Lokesh: అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం సందర్శించిన మంత్రి నారా లోకేష్
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. హంతకుడు శివకుమార్, మృతురాలు సల్మాన్ మధ్య గత కొంతకాలంగా పరిచయం ఉందని, అయితే ఇటీవల ఆమె మరో వ్యక్తితో చాటింగ్ చేయడం శివకుమార్‌కు రగిలి పోయేలా చేసింది. ఇదే విషయంలో అతడు ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన ఈ గొడవ క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారి తీసింది. అయితే , హత్య చేసిన అనంతరం శివకుమార్ పరారయ్యాడు.
నిందితుడు జంట హత్యలు చేసి పరారవుతుండగా పట్టుకున్న కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి, నిందుతుడు పరారౌరవుతున్న సమయంలో ముళ్ళ కంచెలలో పరిగెడుతూ నిందితుడిని అదుపులోకి కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి తీసుకున్నారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు ఎస్సై శ్రీహరి. ఈ ఘటనలో ఎస్సై శ్రీహరికి ఎడమకంటికి గాయం అయ్యింది. కర్తవ్య నిర్వహణలో ధైర్యసాహసాలు చూపించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న కొవ్వూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి ఈ అమానుష ఘటన రాజమండ్రి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. తల్లి, కూతుళ్లను నడిరాత్రి హత్య చేయడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.