Nalgonda: బీఆర్‌ఎస్ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలో రైతు మహా ధర్నా..
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతించిన పాలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు, నేడు ధర్నా నిర్వహించేందుకు చివరకు అనుమతించారు.
Also Read: Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
Also Read
21న ట్రాఫిక్ సమస్యలు, గ్రామ సభల నిర్వహణ కారణంగా అనుమతి లేదని చెప్పిన పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల హైకోర్టు ఆశ్రయంతో 27న ధర్నాకు అనుమతి ఇచ్చారు. అయితే, పార్టీ నాయకులు ధర్నా నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరగా, 1500 మంది భాగస్వామ్యంతో ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ర్యాలీ పట్టణంలోని ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు సాగి, గడియారం సెంటర్‌లో మహాధర్నా నిర్వహించనున్నారు. పోలీసులు ఈ ధర్నా కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతించారు. దీనికి అనుగుణంగా బీఆర్‌ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Also Read: Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
రైతు సమస్యలను ప్రస్తావిస్తూ, రైతుల పక్షాన బీఆర్‌ఎస్ తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ప్రభుత్వానికి తీర్మానాలను అందించడమే ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశ్యం. దీనితో ప్రజల దృష్టి నల్లగొండ పట్టణంలో మహాధర్నా ప్రజల దృష్టిని ఆకర్షించనుంది. మహా ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నా ద్వారా బీఆర్‌ఎస్ రైతు సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఎలా ఆకర్షిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?