MLAs Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై మరోసారి హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దని ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. అయితే.. కేసులు నమోదు అయినప్పుడు రాజకీయ పరంగా విమర్శలు సర్వసాధారణమని, ఢిల్లీ లిక్కర్ స్కాం కేస్ లోనూ ఆప్ నేతలపై బీజేపీ విమర్శలు చేసిందని దుష్యంత్ దవే అన్నారు. ప్రతి విమర్శను టీవీలు చూపిస్తున్నాయని దుష్యంత్ దవే అనడంతో.. మేము టీవీలు చూడటం ఎప్పుడో మానేసామన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో.. సిట్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని, సిట్‌లో ఉన్న ఐపీఎస్ లపై ఎటువంటి ఆరోపణలు లేవని, గతంలో వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్లలో సిట్ లో ఒక ఐపీఎస్ ఉంటే బావుండేదనీ సుప్రీం కోర్టు వాఖ్యాన్నించిందని దుష్యంత్ దవే వివరించారు.
Also Read : Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ముఖ్య మంత్రి ప్రెస్ మీట్ ను కేంద్రంగా చూపి దర్యాప్తు సంస్థ ను మార్చేస్తారా ? ఇది ఒక ట్రాప్ కేస్ అని సింగిల్ జడ్జి మర్చిపోయారు. నిందితులు ఫార్మ్ హౌస్ కి వచ్చింది వాస్తవం కాదా అని దుష్యంత్ దవే అన్నారు. డబ్బు, పదవులు ఎర చూపి ఎం ఎల్ ఏ లను కొనుగోలు చేయాలనుకుంది వాస్తవం కాదా అని, నిందితులు మాట్లాడింది అంతా ఎలక్ట్రానిక్ పరికరాలలో రికార్డ్ అయ్యిందని, డేటా మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ లో బయట పడిందన్నారు దుష్యంత్ దవే . పోలీసుల విచారణను ఎలా తప్పుపడుతామని దుష్యంత్ దవే హైకోర్టుకు ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రతివాదుల వాదనలు ముగిశాయి.
Also Read : Ruhani Sharma: నాని చేతుల మీదుగా ‘హర్’ టీజర్!
తాజావార్తలు
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?