Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Brs Mla Vemula Prashanth Reddy Criticized The Installation Of Rajiv Gandhis Statue

Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు

Published Date :September 16, 2024 , 4:19 pm
By Chandra Shekhar Pamena
  • రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయం
  • సోనియాగాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు- ప్రశాంత్ రెడ్డి
  • ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు- ప్రశాంత్ రెడ్డి
  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు- ప్రశాంత్ రెడ్డి.
Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, సి. రాకేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు.. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఒక ప్లాజాను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

పోలీస్ స్టేషన్స్, ఫుడ్ కోర్ట్స్, బస్ స్టాప్ కట్టాలని కేసీఆర్ అనుకున్నారు.. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్స్ రూపొందించింది.. జులై 2023లో కొన్ని డిజైన్స్ తెప్పించాము.. ఒక వైపు తెలంగాణ సెక్రటేరియట్, మరో వైపు తెలంగాణ అమర జ్యోతి.. మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆత్మ లింక్‌ను రేవంత్ రెడ్డి కట్ చేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగుబంధం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఎలాంటి సందర్భం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభిస్తున్నారని తెలిపారు. హామీలు అమలు చేయలేకపోతున్నారు.. కాబట్టి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

కేసీఆర్ మంచిని కొనసాగించవద్దని రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి గౌరవం పెరిగే విధంగా చర్యలు ఉంటాయి.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనసాగించాలని అమరజ్యోతిని కేసీఆర్ నిర్మించారు.. అమెరికాలో ఉన్న చికాగో బీన్ కంటే పెద్దదిగా తెలంగాణ అమరజ్యోతి నిర్మాణం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మాత్రం రేవంత్ రెడ్డి కూర్చుంటున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ అమరజ్యోతిలో ఏం జరగేలేదు.. కట్టడంపై అపోహలు ఉంటే తొలగించుకోవాలని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరజ్యోతిని చూడటానికి ప్రజలకు అనుమతి ఇవ్వాలి.. నెక్లెస్ రోడ్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించారు.. పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించారు.. అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజలను అనుమతించడం లేదన్నారు. అంబేద్కర్ జయంతి రోజు సీఎం, మంత్రులు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళలేదని అన్నారు. రేవంత్ రెడ్డికి అహంకారం ఎందుకు అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కట్టినందుకే అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజలను అనుమతించడం లేదా…?. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Chiranjeevi: తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కి చిరు సహా పలువురి విరాళాలు.. ఎవరెవరంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • CM Revanth Reddy
  • congress govt
  • MLA Vemula Prashanth Reddy
  • rajiv gandhi statue

తాజావార్తలు

  • CM Chandrababu: ప్రజాప్రతినిధులు ఓ కుటుంబంలా కలిసి పనిచేయాలి..!

  • Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర

  • Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

  • Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కాస్త దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచింది.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

ట్రెండింగ్‌

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions