NTV Telugu Site icon

MLA Prakash Goud: ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ యూటర్న్‌.. కాంగ్రెస్‌కు షాక్‌..!

Prakash Goud

Prakash Goud

MLA Prakash Goud: కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌.. ఇప్పుడు ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం తన కేడర్ తో సమావేశమయ్యారు ప్రకాష్ గౌడ్.. అయితే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ కు సూచించారు పలువురు నేతలు.. దీంతో, తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనుకడుగు వేశారు.. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు..

Read Also: BC Janardhan Reddy: బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!

అయితే, శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల గురించి చర్చించినట్లు తెలిపారు.. తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు వెల్లడించారు.. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, నాయకులతో సమావేశమై వారు సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారట.. అయితే శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ముఖ్య బీఆర్ఎస్ నాయకులతో సమావేశం చర్చలు జరిపారు.. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఉద్యమం నుండి పార్టీలో పనిచేసిన తమకు చెడ్డ పేరు వస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం కేడర్‌ ఆయన చెప్పారట.. దీంతో, ప్రస్తుతం పార్టీని వీడడం తన కేడర్‌కు ఇష్టం లేదని.. వారికి ఇష్టంలేని పని తాను ఎప్పటికీ చేయనని.. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తానని.. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తేల్చేశారు.. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని మీ వెంట నేనున్నానని.. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌. అయితే, ప్రకాష్‌ గౌడ్‌ యూ టర్న్‌ తీసుకుని బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో.. కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.