Jagadish Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ఒక్క ఏడాది పాలనలోనే తెలంగాణ అభివృద్ధిని నిలిచిపోయిందని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. అయితే, మంత్రుల ఆదాయాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతల పని దోచుకోవడం, దాచుకోవడమేనని ఆయన మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇవ్వాల్సిన మంత్రులు హెలికాప్టర్లలో షికార్లు చేస్తుంటే, ఎండిన పంటలను పరిశీలించేందుకు మాత్రం సమయం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలోని నేతలు రైతులను తీవ్రంగా అవమానిస్తున్నారని, వారి బాధను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే, తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాననే భయంతోనే సభ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “తెలంగాణలో ప్రస్తుతం కమిషన్ల వ్యవస్థ రాజ్యమేలుతోంది. కమిషన్ ఇవ్వకపోతే ఏ పనీ జరగడం లేదు. ప్రభుత్వ పనులన్నీ లంచాల ఆధారంగా నడుస్తున్నాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Bhadradri Kothagudem: ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి