Site icon NTV Telugu

R.S PraveenKumar: “పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి”

Rs Praveen Kumar

Rs Praveen Kumar

రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎస్పీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..కానిస్టేబుల్స్ ను కేసీఆర్ మనుషులుగా చూస్తే.. రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారన్నారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలని తెలిపారు. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి అన్నారు. స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ కు పిల్లనిచ్చే పరిస్థితి లేదన్నారు. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తాననటం దారుణమన్నారు.
రేవంత్ సెక్యూరిటీ డ్యూటీ చేసే కానిస్టేబుల్స్ కూడా స్పెషల్ పోలీసులే అని గుర్తు చేశారు.

READ MORE: Flight Bomb Threats: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు.. ‘‘ఎక్స్‌’’పై కేంద్రం ఆగ్రహం..

హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ రెడ్డి కానిస్టేబుల్స్ తో మాట్లాడాలని.. పాత పద్ధతిలో 15రోజులు డ్యూటీ చేస్తే.. 4రోజులు సెలవు ఇవ్వాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయని.. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో వృద్ధ దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదని.. తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉందన్నారు. ఇది ప్రమాదకరమని.. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారన్నారు.

READ MORE: Cyclone Dana: తీరం వైపు దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Exit mobile version