Site icon NTV Telugu

BRS: మరో రెండు ఎంపీ స్థానాలు ప్రకటించిన బీఆర్ఎస్..

Brs

Brs

పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.

Read Also: Women’s Day Awards: మహిళా దినోత్సవం పురస్కారాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

తాజాగా ఇద్దరు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా 11కి చేరింది. ఇంకా 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్‌ఎస్‌.. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. అటు.. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు అవకాశం ఇచ్చారు.

Read Also: Gay footballer: స్టేడియంలో భాగస్వామికి గే క్రీడాకారుడి ప్రపోజ్.. రెస్పాన్స్ ఏంటంటే..!

Exit mobile version