అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియాల్లో క్రికెటర్స్ తమ ప్రేమను ప్రేమికురాలు ఎదుట ప్రపోజ్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చాలా చూసుంటాం. అమ్మాయి-అబ్బాయి ఇలా ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకోవడంలో తప్పేమీ లేదు… కానీ ఫుట్‌బాల్ అభిమానులకు మాత్రం ఒక వింతైన సంఘటన ఎదురైంది. ఇద్దరు గే ప్రేమికులు బహిరంగంగా లవ్ ప్రపోజ్ చేసుకోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
జోష్ కావల్లో అనే గే ఫుట్‌బాల్ ఆటగాడు.. తన భాగస్వామి అయిన లైటన్ మోరెల్‌కు బహిరంగంగా లవ్ ప్రపోజ్ చేశాడు. ఖాళీగా ఉన్న హింద్‌మార్ష్ స్టేడియంలో ఈ సన్నివేశం జరిగింది. జోష్.. మోకాలు మీద నిలబడి తన భాగస్వామికి ప్రేమను అభ్యర్థించాడు. ఇదొక సంతోషకరమైన విషయమంటూ జోష్ ఉప్పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జోష్ కావల్లో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
తన ప్రయాణం ప్రారంభించిన పిచ్‌లోనే ఇంతటి ప్రత్యేక క్షణాన్ని పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని జోష్ చెప్పుకొచ్చాడు. మోరెల్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరు ఎప్పటినుంచో గే ప్రేమికులుగా ఉన్నారు.
జోష్ కావల్లో 2021లో స్వలింగ సంపర్కుడిగా ధైర్యంగా చెప్పుకున్నాడు. అనంతరం అతడికి అనూహ్యంగా మద్దతు లభించింది. ప్రశంసలు కూడా పొందాడు. టాప్ ఫ్లైట్ లీగ్‌లో ఆడుతున్న ఏకైక గే పురుషుల ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పేరు సంపాదించాడు. తన లైంగికతను రహస్యంగా ఉంచాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఫుట్‌బాల్ ఆటలో తన ప్రతిభను కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.
అలాగే జోష్ కావల్లోకి ఫుట్‌బాల్ క్లబ్‌లు, ఆయా సంస్థల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్‌ల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం.
ఎల్లెన్ డిజెనెరెస్ వంటి ప్రముఖ వ్యక్తులు కూడా కావాల్లో విధానాన్ని ఎంకరేజ్ చేశారు. ప్రముఖ US టాక్ షో హోస్ట్‌గా ఎల్లెన్ డిజెనెరెస్ ఉన్నారు. కావల్లో విధానానికి మద్దతు పలికాడు. కావాల్లో పంచుకున్న ఫొటోలు గంటల్లోనే వ్యాప్తి చెందాయి. పెద్ద ఎత్తు నెటిజన్లు ఫొటోలను వీక్షించారు.