NTV Telugu Site icon

MLAs Disqualification: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..

Brs

Brs

ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై రెండు పిటిషన్లు వేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పీ వేయగా.. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరింది బీఆర్ఎస్.. ఢిల్లీలోని లీగల్ టీమ్‌తో మాజీ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. ఎమ్మె్ల్యేల అనర్హతపై నిర్ణయంలో స్పీకర్ జాప్యం చేయడంతో ముందుగా ఆశ్రయించింది బీఆర్ఎస్.. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్ కే వదిలేసింది. దీంతో సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Show comments