Shahid Kapoor React on His Love Breakups: షాహిద్ కపూర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2003లో ‘ఇష్క్ విష్క్’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 2006లో వచ్చిన ‘వివాహ్’ ద్వారా మంచి హిట్ ఖాతాలో వేసుకున్న షాహిద్.. ఆ తరువాత ఏడాది వచ్చిన ‘జబ్ వుయ్ మెట్’తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లవర్ బాయ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. కమీనీ, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్, కబీర్ సింగ్, ఫర్జీ, జెర్సీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న షాహిద్.. నిజ జీవితంలో మాత్రం ప్రేమలో ఒడిపోయాడు.
తాజాగా బాలీవుడ్ నటి నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ తన బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయావు? అని నేహా అడగ్గా.. ముందుగా నవ్వుకున్నా, సమాధానం చెప్పడానికి షాహిద్ వెనుకాడాడు. ఆపై ప్రేమ పేరుతో తనను ఇద్దరు మోసం చేశారని చెప్పాడు. ‘నేను ఒకటని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరొకదాని గురించి పెద్ద సందేహాలు ఉన్నాయి. రెండుసార్లు ప్రేమలో విఫలమయ్యా అనుకుంటున్నా. వారి పేర్లను నేను చెప్పను’ అని షాహిద్ పేర్కొన్నాడు.
Also Read: Disha Patani Bikini: బికినీలో దిశా పటానీ.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!
పేర్లను చెప్పడానికి షాహిద్ కపూర్ నిరాకరించినప్పుడు.. మీరు డేటింగ్ చేసిన ఆ ఇద్దరు ప్రముఖ మహిళలు (కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా) కదా? అని నేహా ధూపియా అన్నారు. దాంతో నేను పేర్లను చెప్పను, ఇంకో ప్రశ్న అడగండి అని షాహిద్ అన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండుసార్లు ప్రేమలో విఫలమైన షాహిద్.. 2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం షాహిద్ ‘దేవ’ అనే సినిమా చేస్తున్నాడు.