కొంతమంది చేసే పనులు చూస్తుంటే వీళ్లు అసలు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకంటే వారు కొంచెం కూడా మానవత్వం లేని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కర్కశ పనులకు పాల్పడింది సాధారణ వ్యక్తి కాదు ఓ జంతుశాస్త్ర నిపుణుడు. జంతువుల గురించి అన్ని విషయాలు తెలిసిన ఆ వ్యక్తి 42 కుక్కలపై అత్యాచారానికి పాల్పడ వాటిని అత్యంత క్రూరంగా హింసించి వాటిలో 39 ప్రాణాలు కోల్పోయేలా చేశాడు. ఈ నీచమైన చర్యలకు పాల్పడ్డాడు బ్రిటన్‌కు చెందిన మొసళ్ల నిపుణుడు, జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆడం బ్రిట్టన్. ఇతడు ప్రముఖ ఛానళ్లు బీబీసీతో పాటు, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కు కూడా పనిచేశాడు.
Also Read: ISKCON Biggest Cheat: ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు.. గోవులను కసాయిలకు విక్రయిస్తోంది..
అతడు కుక్కలను రేప్ చేసి వాటిని హింసిస్తూ వీడియోలు కూడా తీసుకున్నాడు. అతడు ఎంతటి ఘోరాలకు పాల్పడ్డాడంటే ఆ వీడియోలను చూస్తే నెర్వస్ షాక్ కు గురయ్యే అవకాశం ఉందని హియరింగ్ కోసం వచ్చిన వారిని బయటకు వెళ్లిపోవాలని ఆదేశించింది కోర్టు. అంటే ఎంత దారుణంగా ఆ వీడియోలు ఉన్నాయో ఓసారి ఊహించుకోండి. ఇప్పటికే నిందితుడిపై 60 అభియోగాలు ఉన్నాయి. వాటిలో ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని యాక్సెస్ చేయడం కూడా ఒకటి. 2014 నుంచి నిందితుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. శునకాలపై అత్యాచారానికి పాల్పడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో గతేడాది బ్రిట్టన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ కు 18 నెలల ముందు 42 కుక్కలపై ఆ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు పెట్టే చిత్రహింసల కారణంగా వాటిలో 39 ప్రాణాలు కోల్పోయాయి. ఈ కేసును విచారించిన కోర్టు అతడికి ఇంకా శిక్షను ఖరారు చేయాలేదు. అతడికి పెద్ద శిక్షే పడే అవకాశం ఉంది.