Aeolus Satellite: చరిత్రలో తొలిసారి.. డెడ్ శాటిలైట్‌ను భూమిపైకి తెచ్చి సురక్షితంగా కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aeolus Satellite: ప్రపంచ చరిత్రలో తొలిసారిగా డెడ్ శాటిలైట్‌ను భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. ఒక యూరోపియన్ ఉపగ్రహం ఇంధనం అయిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయేలా తయారు చేయబడింది. ఏయోలస్ అనే పేరుతో, 1,360 కిలోల కంటే ఎక్కువ బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. ఈ శాటిలైట్ కాలపరిమితి ఐదేళ్లు. ఇటీవల ఇంధనంతోపాటు మిషన్ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్ అయిన ఈ శాటిలైట్ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల ) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతోంది. అయితే నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి తెచ్చి సురక్షితంగా కూల్చివేసే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించలేదు.
Also Read: Seven Sixes: ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టిన ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
దీని కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని మిషన్ కంట్రోల్ నుంచి శాటిలైట్ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టారు. దీంతో ఈ నెల 24న ఆ డెడ్ శాటిలైట్ 280 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత దాని ఎత్తు 250 కిలోమీటర్లకు తగ్గించారు. అలా క్రమంగా ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. శుక్రవారం నాటికి భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు ఏయోలస్ శాటిలైట్ చేరుకుంది. అనంతరం దాని కక్ష్యను మరింతగా మార్పు చేశారు. చివరకు ఆ శాటిలైట్ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది.
Also Read: Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
సాధారణంగా పడే ఉపగ్రహంతో పోలిస్తే ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు తగ్గుతాయని ఏజెన్సీ పేర్కొంది. ఈ విధంగా ప్రమాదాలు 42 రెట్లు తగ్గుతాయి. 1360 కిలోల బరువున్న భారత ఉపగ్రహం ఏయోలస్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2018లో ప్రయోగించింది. భూమి, ఇతర గ్రహాల చుట్టూ గాలి వేగాన్ని కొలవడం దీని లక్ష్యం. వాతావరణ సమాచారాన్ని అందించే ముఖ్యమైన గ్రహాలలో ఇది ఒకటి. ఏయోలస్ అంటే ఏమిటంటే.. గ్రీకు పురాణాలలో గాలుల రక్షకుడిని ఏయోలస్ అని పిలుస్తారు. ఈ ఉపగ్రహం గాలి వేగాన్ని కొలిచే పని కాబట్టి, దీనికి ఏయోలస్ అని పేరు పెట్టారు. వాతావరణాన్ని అంచనా వేయడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!