డెడ్ శాటిలైట్‌ను తొలిసారిగా భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. ఒక యూరోపియన్ ఉపగ్రహం ఇంధనం అయిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయేలా తయారు చేయబడింది. ఏయోలస్ అనే పేరుతో, 1,360 కిలోల కంటే ఎక్కువ బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది.
భూమిపై మరో శాటిలైట్ కుప్పకూలేందుకు సిద్ధం అవుతోంది. 1360 కిలోల శాటిలైట్ భూమిపై క్రాష్ కానుంది. యూరప్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన ‘‘ఏయోలస్’’ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం చివరి అంకానికి చేరుకుంది. 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగున్న ఈ అంతరిక్ష నౌక వేగంగా తన ఇంధనాన్ని కోల్పోతోంది. దాదాపుగా దాని ఇంధన నిల్వలు క్షీణించాయి. అయితే ఉపగ్రహానికి సంబంధించిన లేజర్ పరికరాలు ఇంకా పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్ కు చెందిన సైన్స్ పరికరాలను ఏప్రిల్…