India Batter Shubman Gill Hospitalised In Chennai with Dengue: భారత అభిమానులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో గిల్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడట. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు మాత్రమే కాదు.. దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడం ప్రస్తుతం అనుమానంగా మారింది.
డెండ్యూ ఫీవర్ కారణంగా శుభ్‌మన్ గిల్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గిల్ స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో హాస్పిటల్‌లో ఉన్న గిల్.. బుధవారం న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనంతరం రెండు రోజుల గ్యాప్ తర్వాత (అక్టోబర్ 14) జరిగే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. అయితే పాక్‌తో మ్యాచ్ సమయానికి గిల్ పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2023, ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టాడు. ఫామ్‌లో ఉన్న గిల్ ఇప్పుడు జట్టులో లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన టీమిండియాను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గట్టెక్కించారు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో గిల్ ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో మరోసారి చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
Shubman Gill hospitalised in Chennai after the platelet count dropped a bit. (PTI).
A big set back for India ahead of big matches in the coming days! pic.twitter.com/o5nUTjX6Hd
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2023