World Cup 2023: నన్ను కొట్టనందుకు చాలా థాంక్స్.. బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paul Van Meekeren Namaste’ gesture to Daryl Mitchell during NZ vs NED Match: క్రికెట్ ఆటలో బ్యాటర్, బౌలర్ మధ్య వాగ్వాదాలు జరగడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. బ్యాటర్ బౌండరీల వర్షం కురిపించినప్పుడు.. బౌలర్ అసహనంలో ఏదో అనడం, బ్యాట్స్‌మెన్ రియాక్ట్ అవ్వడం చకచకా జరిగిపోతుంటుంది. అలానే బౌలర్ బాగా బౌలింగ్ చేసినపుడు కూడా బ్యాటర్ స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఇందుకు బిన్నంగా ఓ ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్‌కు బౌలర్ చేతులు జోడించి నమస్కరించాడు. ఈ ఘటన ప్రపంచకప్ 2023లో చోటుచేసుకుంది.
సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ మెరుపు షాట్ ఆడాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో డచ్ పేసర్ వాన్ మీకెరెన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్‌లను గిరాటేసింది. బంతి కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్‌లను తాకింది. ఇది చూసిన మీకెరెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
Also Read
Also Read: World Cup 2023: కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
బంతి తనకు తాకనందుకు పేసర్ వాన్ మీకెరెన్ సంతోషించాడు. అందుకే బ్యాటర్ డారెల్ మిచెల్‌కు చేతులు జోడించి నమస్కరించాడు. ఇది చూసిన మిచెల్ పేర్లదు అన్నారు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్.. మీకెరెన్ చేసిన పని అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నన్ను కొట్టనందుకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియో చూసిన ఫాన్స్ తృటిలో పెను ప్రమాదం తప్పింది అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!