Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!
- వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహణ
- మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన బొత్స
- వైఎస్సార్‌పై దిగజారుడు వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఆవేదన
- జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై కూటమి నేతల స్పందనపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Emotional: వైస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ఈవెంట్ లో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర రెడ్డి మరణాన్ని ప్రస్తావిస్తూ కంటతడి పెట్టారు. మహానేత గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన బొత్స తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ గురించి మాట్లాడినప్పటి నుంచి కూటమి నేతలు, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నారని విమర్శించారు. అలాగే “మా నాయకుడి ఆలోచనలు మీకు ఎందుకు భయం కలిగిస్తున్నాయి?” అంటూ ప్రశ్నించారు.
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
రాష్ట్ర మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, రాజకీయ విలువలు తగ్గిపోయాయని బొత్స అన్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు సహనం కోల్పోయి అహంభావంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చేసిన వ్యాఖ్యలు, చర్యలు మర్చిపోయి ఇప్పుడు ఇతరులను విమర్శించడం సరైంది కాదన్నారు. వైఎస్సార్ వంటి నాయకులు అరుదుగా వస్తారని, ఆయన వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని బొత్స గుర్తు చేశారు. ఆయన మరణంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని హెచ్చరించారు. “రాజశేఖర్ రెడ్డి మరణం గురించి నేను చెప్పానని ప్రచారం చేయడం బాధాకరం” అని అన్నారు.
Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..
వైఎస్సార్ మృతదేహాన్ని గుర్తించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స భావోద్వేగానికి గురయ్యారు. తెల్లవారుజామున పావురాల గుట్ట వద్ద మృతదేహాన్ని గుర్తించి ఉదయం 5 గంటలకు కర్నూలుకు తరలించిన విషయాన్ని వివరించారు. రాజకీయాల కోసం దిగజారుడు స్థాయికి వెళ్లకూడదని బొత్స సూచించారు. “దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ మరణించిన మహానాయకులపై విమర్శలు చేయకండి” అని అన్నారు. పరస్పర గౌరవం ఉండాలని, నీతిగా రాజకీయాలు చేయాలని సూచించారు. తమ పార్టీ, నేతల చరిత్రపై తమకు పూర్తి అవగాహన ఉందని, తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. “ఇదేనా మీ సంస్కృతి?” అంటూ ప్రత్యర్థులను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!